-->
Most Eligible Bachelor: బ్యాచిల‌ర్ రాక ఆల‌స్యం కానుందా.? అఖిల్ చెప్పిన రోజున రావ‌ట్లేదా.?

Most Eligible Bachelor: బ్యాచిల‌ర్ రాక ఆల‌స్యం కానుందా.? అఖిల్ చెప్పిన రోజున రావ‌ట్లేదా.?

Most Eligible Bachelor

Most Eligible Bachelor: అఖిల్, పూజాహెగ్డే జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. బొమ్మ‌రిళ్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హ‌సిస్తున్న ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అటు అఖిల్‌, ఇటు భాస్క‌ర్ కెరీర్‌కు కీల‌కంగా మార‌డంతో సినిమాకు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త వ‌చ్చింది. ఇక భాస్క‌ర్ కూడా ఈ సినిమాను అంచ‌నాలు అందుకునే స్థాయిలోనే తెర‌కెక్కించార‌ని స‌మాచారం. నిజానికి ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే తాజాగా క‌రోనా నిబంధ‌న‌లు ఎత్తేయ‌డంతో సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేశారు.

ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 8వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రిలీజ్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చెప్ప‌న రోజున థియేట‌ర్ల‌లోకి రావ‌ట్లేద‌ని తెలుస్తోంది. కార‌ణాలు తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఈ సినిమా విడుద‌ల వారం రోజుల పాటు వాయిదా ప‌డ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ చిత్రాన్ని మూవీ మేక‌ర్స్ ద‌స‌ర రోజున అంటే అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.

Bigg Boss 5 Telugu: బిగ్‍బాస్ సీజన్ 5 పై నెటిజన్స్ పెదవివిరుపు.. ఇంటిసభ్యుల తీరుపై అసహనం.. కారణమేంటంటే..

Lakshmi Manchu Saree Photo: కొత్తగా చీరకట్టులో కవ్విస్తున్న లక్ష్మి ప్రసన్న మంచు (ఫొటోస్)



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kEDOMw

0 Response to "Most Eligible Bachelor: బ్యాచిల‌ర్ రాక ఆల‌స్యం కానుందా.? అఖిల్ చెప్పిన రోజున రావ‌ట్లేదా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel