
IPL 2021, RCB vs MI: రోహిత్ సేనకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ బౌలర్.. హ్యాట్రిక్‌తో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్

Harshal Patel at-ఒrick: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, రాహుల్ చాహర్‌లను ఔట్ చేసిన హర్షల్ పటేల్.. ఈ ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సాధించిన మూడో ఆర్‌సీబీ బౌలర్‌గా నిలిచాడు. హర్షల్ కంటే ముందు ప్రవీణ్ కుమార్ 2010 లో ఆర్‌సీబీ తరపున హ్యాట్రిక్ సాధించాడు. 2017 లో శామ్యూల్ బద్రీ ఇదే టీం తరపున హ్యాట్రిక్ సాధించాడు. అదే సమయంలో ముంబైపై ఇలాంటి ఫీట్ చేసిన మూడవ ఆటగాడు కూడా హర్షల్ పటేల్ కావడం విశేషం. అతనికి ముందు శామ్యూల్ బద్రీ, రోహిత్ శర్మ ముంబైపై హ్యాట్రిక్ సాధించారు.
ముంబై ఇండియన్స్‌పై హర్షల్ పటేల్ 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ కారణంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు కేవలం 111 పరుగులకే పరిమితమైంది. 165 పరుగుల ఛేజింగ్‌లో ముంబై ఘోర పరాజయం పాలైంది. హర్షల్ మొదట హ్యాట్రిక్ సాధించి, ఆపై తన చివరి ఓవర్‌లో ఆడమ్ మిల్నేను ఔట్ చేసి నాల్గవ వికెట్ సాధించాడు. హర్షల్ అద్భుతమైన ఆట కారణంగా ముంబై జట్టు ఐదు వికెట్లకు 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది.
ముంబైపై హర్షల్ ప్రదర్శన
ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్‌తో హర్షల్ పటేల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. సీజన్ మొదటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు రెండోసారి తలపడ్డాయి. అయితే తొలిసారి తలపడినప్పుడు హర్షల్ హ్యాట్రిక్‌ను కోల్పోయాడు. కానీ, రెండోసారి పోరులో హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేసి హ్యాట్రిక్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2021 లో ఆర్‌సీబీ బౌలర్ ముంబైతో ఈ సీజన్‌లో జరిగిన మ్యాచుల్లో 44 పరుగులు మాత్రమే ఇచ్చి తొమ్మిది వికెట్లు తీశాడు.
ఐపీఎల్ 2021 లో హర్షల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ తీసుకునే బౌలర్ల జాబితాలో అతను ముందు వరుసలో ఉన్నాడు. హర్షల్ పటేల్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతను 13.56 సగటు, 8.58 ఎకానమీతో వికెట్లు తీశాడు. అతను రెండో ర్యాంక్ అవేశ్ ఖాన్ కంటే ఎనిమిది వికెట్లు ముందున్నాడు.
WHAT. A. MOMENT for @HarshalPatel23
#VIVOIPL #RCBvMI pic.twitter.com/tQZLzoZmj6
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Also Read: IPL 2021: అరుదైన రికార్డును సృష్టించిన కోహ్లీ.. ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా సాధించలే.. అదేంటంటే?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3obbmnI
0 Response to "IPL 2021, RCB vs MI: రోహిత్ సేనకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ బౌలర్.. హ్యాట్రిక్‌తో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్"
Post a Comment