
Crime News: అనంతపురంలో దారుణం.. వేధిస్తున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య..

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిత్యం వేధిస్తున్న భర్తను ఓ మహిళ రోకలి బండతో కొట్టి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.. రాజేంద్ర ప్రసాద్, కుసుమ భార్యాభర్తలు. అనంతపురం నగరంలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే చాలా రోజులుగా రాజేంద్రప్రసాద్ వివిధకారణాలతో భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. తన భర్త ఎప్పటికైనా మారుతాడని కుసుమ కూడా సహనంతో అతనిని భరిస్తూ వచ్చింది. కానీ రాజేంద్రప్రసాద్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కుసుమ కూడా విసిగివేసారి పోయింది.
ఇక తన భర్త మారడనుకుని నిర్ణయించుకున్న ఆమె రాజేంద్రప్రసాద్‌ను రోకలి బండతో కొట్టి చంపేసింది. ఆపై తానే ఈ హత్యకు పాల్పడినట్లు నేరుగా పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు సంఘటనా వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లిపోవడంతో వీరి ఇద్దరి పిల్లలు అనాథలుగా మారిపోయారు.
Also Read:
Kilo Class Submarine: నేవీలో కలకలం రేపుతోన్న సబ్-మెరైన్ డేటా లీక్.. తాజా ఛార్జిషీట్ దాఖలుతో అధికారుల్లో గుబులు
Road Accident: రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఎంపీడీవో మృతి.. పలువురికి గాయాలు..!
Viral Video: ప్రాణం తీసిన గుంత.. ఆఫీస్‌కు వెళ్తుండగా.. బస్సు కిందపడి బైకర్ దుర్మరణం.. వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BDsoOo
0 Response to "Crime News: అనంతపురంలో దారుణం.. వేధిస్తున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య.."
Post a Comment