-->
Gulab Cyclone: తీరం దాటిన గులాబ్‌ తుఫాను.. మరో ఐదు గంటల్లో తీవ్ర తుఫానుగా మారి..

Gulab Cyclone: తీరం దాటిన గులాబ్‌ తుఫాను.. మరో ఐదు గంటల్లో తీవ్ర తుఫానుగా మారి..

Gulab Cyclone

Gulab Cyclone: గులాబ్‌ తుఫాను తీరం దాటింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఆదివారం అర్ధరాత్రి తుఫాను తీరం దాటింది. మరో ఐదు గంటల్లో ఈ తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారి బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు తుఫాను ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య గులాబ్ తీరం దాటింది. ఇక తుఫాను తీరం దాటిన తర్వాత పరిస్థితులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ పరిశీలిస్తున్నారు. అయితే తీరం దాటిన తర్వాత ఎక్కువ నష్టం ఏమీ లేదని అన్నారు. పలుచోట్ల చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ కు పలుచోట్ల అంతరాయం కలిగింది. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.  యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతోంది. తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. 30 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు 1500 మంది ప్రజలను తరలించామని కలెక్టర్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరంతా రెండు రోజుల కిందట కొత్త బోటు కొనేందుకు ఒడిశా వెళ్లారు. తిరుగుపయనంలో మత్స్యకారుల బోటు తుఫానులో చిక్కుకుంది. మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో మంచినీళ్లపేట గ్రామస్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేశ్​లాఠకర్ సూచించారు. వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది.

కాగా, గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్‌ అదిత్య నాథ్‌ చర్యలు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gulab Cyclone: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ముగ్గురు క్షేమంగా.. 

Gulab Cyclone Updates: వాహనాలపై ప్రయాణాలు చేయొద్దు, ఎత్తైన ప్రదేశాలు.. చెట్ల కింద ఉండొద్దు. ఉత్తరాంధ్రలో గులాబ్ గుబులు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zUdTF7

0 Response to "Gulab Cyclone: తీరం దాటిన గులాబ్‌ తుఫాను.. మరో ఐదు గంటల్లో తీవ్ర తుఫానుగా మారి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel