
IND vs ENG 4th Test Day 1 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన తొలిరోజు ఆట.. బౌలర్లదే హవా..

India vs England 2021: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఓవల్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. తొలిరోజు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటగా ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియాను 191 పరుగులకే కట్టడి చేయగా.. ఆ తరువాత భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ల 3 వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు కెప్టెన్ జో రూట్ సహా మూడు వికెట్లు సమర్పించుకుంది. ఆతిథ్య జట్టుపై భారత్ 138 పరుగుల ఆధిక్యంల ఉంది. రెండవ రోజు డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు. ఇక 46 బంతులాడిన మలన్.. 26 పరుగులు చేశాడు. 8 బంతులాడిన క్రెయిడ్ ఓవర్టన్ 1 పరుగు చేశాడు. రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, జో రూట్ అవుట్ అయ్యారు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బౌండరీలతో కొద్దిసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దుల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శార్దుల్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్‌సన్ 3, అండర్ సన్, క్రిగ్ తలో వికెట్ పడగొట్టారు.
BCCI Tweet:
That’s Stumps on Day 1 of the 4th Test at The Oval!
England 53/3 & trail #TeamIndia by 138 runs.
2⃣ wicket for @Jaspritbumrah93
1⃣ wicket for @y_umeshWe will see you tomorrow for Day 2 action. #ENGvIND
Scorecard
https://t.co/OOZebP60Bk pic.twitter.com/g0HiOSOJQq
— BCCI (@BCCI) September 2, 2021
Also read:
M. K. Stalin: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సతీసమేతంగా కలిసిన తమిళ్ సీఎం స్టాలిన్..
Rashi Khanna: తెల్ల పూలతో, కవ్వించే చూపులతో మనసు దోచుకుంటున్న బొద్దు ముద్దుగుమ్మ రాశి ఖన్నా..
Amritha Aiyer: అల్లరి అందంతో మత్తెకించే చూపులతో కట్టిపడేస్తున్న అమృత అయ్యర్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DzTQi2
0 Response to "IND vs ENG 4th Test Day 1 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన తొలిరోజు ఆట.. బౌలర్లదే హవా.."
Post a Comment