
Telangana MLC: తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. పేర్లను ఖరారు చేసిన కేసీఆర్

Telangana MLC: తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. మరణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కసరత్తు చేయగా, ఇందులో నాలుగు సీట్లు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. బీసీలు, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పేర్లను ఖరారు చేశారు.
ఇవి కూడా చదవండి:
PM Modi: ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్.. తాజా సర్వేలో ఆ వివరాలు..
Telangana: యాసంగిలో వరి ధాన్యం కొనలేము.. రైతులకు పలు సూచనలు చేసిన రాష్ట్ర సర్కార్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kxFEOX
0 Response to "Telangana MLC: తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. పేర్లను ఖరారు చేసిన కేసీఆర్"
Post a Comment