
విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా

ధనిక రాష్ట్రం తెలంగాణను టీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలపై కాకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికాయి కమలం శ్రేణులు. ఈటల రాజేందర్ గెలుపు క్రెడిట్ హుజురాబాద్ ప్రజలకు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి.. నిజమైన పాలన బీజేపీ ద్వారానే సాధ్యమన్నారు. హుజురాబాద్ ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందన్న కిషన్ రెడ్డి.. ఈ ఉప ఎన్నికతోనే దళితబంధు వచ్చిందన్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రగతి భవన్ వరకు.. అందులో పనిచేసేది తెలంగాణ వ్యతిరేకులని అన్నారు కిషన్ రెడ్డి.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చేవాటికి ఆశపడి కొందరు పనిచేశారని అన్నారు. ఒక్క ఉప ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు చేశారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాబోయే 2023లో ప్రజలు టీఆర్ఎస్‌ను పాతరేసి.. బీజేపీని గెలిపిస్తారని ఈటల అన్నారు.
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌పల్లి నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్ వచ్చారు. ముందుగా గన్‌పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద ఈటలతోపాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు.
ఇవి కూడా చదవండి: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో హీట్ పెంచిన మాటల తూటలు.. దూసుకొచ్చిన మరో కొత్త బుల్లెట్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wkARou
0 Response to "విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా"
Post a Comment