-->
Anand Mahindra: మనసు ఉంటే చాలు.. ఇలా కూడా పే చేయవచ్చు.. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: మనసు ఉంటే చాలు.. ఇలా కూడా పే చేయవచ్చు.. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వారు తరచూ ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన ట్వీట్లు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంటుంది. కొన్నిసార్లు వారు తమాషాగా ఉండే వీడియోలను షేర్ చేస్తుంటారు. మరి కొన్నిసార్లు వారు అద్భుతమైన వీడియోలను పంచుకుంటారు. అయితే శనివారం ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.  ఈ వీడియోపై చర్చ కూడా సాగుతోంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయనేందుకు ఓ నిదర్శనం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేసారు.. ఆ వీడియో చూడండి

దీనితో అతను క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు. భారతదేశంలో పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులకు మారడానికి మీకు ఇంతకంటే రుజువు కావాలా?! అంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ వీడియోలో ఏముంది? 

ఈ 30 సెకన్ల క్లిప్‌లో చాలా విషయం ఉంది. ఇందులో బసవన్నను తీసుకొచ్చిన వ్యక్తికి బార్‌కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రజలు భయపడి పారిపోయేవారు. ఈ రోజుల్లో ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవడానికి  సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులను ఇష్టపడుతున్నారు.

ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు దూసుకుపోతున్నాయి. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ స్థాయి అక్టోబర్‌లో కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది పండుగ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది.

అక్టోబర్‌లో UPI లావాదేవీల విలువ 100 100 బిలియన్‌లను అధిగమించింది. రూపాయి పరంగా, లావాదేవీల విలువ రూ. 7.71 లక్షల కోట్లు.. ఈ నెలలో 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. రెండూ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలలో ఉన్నాయి.

2016లో UPI ప్రారంభించబడినప్పుడు, 2020 అక్టోబర్‌లో నెలవారీ లావాదేవీ విలువ రూ. 3.86 లక్షల కోట్లు దాటడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. అయితే అక్టోబర్‌లో ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగి రూ.7 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/300FEiY

Related Posts

0 Response to "Anand Mahindra: మనసు ఉంటే చాలు.. ఇలా కూడా పే చేయవచ్చు.. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel