-->
Dark Circles: డార్క్ స‌ర్కిల్స్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..! అయితే బాదంతో ఇలా చేయండి ..

Dark Circles: డార్క్ స‌ర్కిల్స్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..! అయితే బాదంతో ఇలా చేయండి ..

Dark Circles

Dark Circles: ప్రతి ఒక్కరూ తమ కళ్ళు అందంగా, ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. అయినప్పటికీ మారిన జీవనశైలి తక్కువ నిద్ర, ఒత్తిడి కారణంగా కళ్ళ కింద‌ నల్లటి ముడతలు వస్తున్నాయి. ఇది అనారోగ్యాన్ని సూచిస్తుంది. డార్క్ సర్కిల్ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అంటే మన శరీరానికి సరైన పోషకాహారం లభించకపోవడం, తప్పుడు ఆహారం తీసుకోవడం వంటివి ఉండొచ్చు. శరీరానికి పూర్తి విశ్రాంతి నివ్వాలంటే, అది పూర్తి నిద్ర ను పొందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . డార్క్ సర్కిల్స్ ను దూరం చేయడంలో బాదం చ‌క్క‌గా ప‌నిచేస్తుంది.

1. బాదం ను ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ నిరోధించ‌వ‌చ్చు. బాదంని మెత్తగా రుబ్బి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. అందులో కొన్ని పాలు కలపాలి. ఈ పేస్ట్ ను కళ్ల కింద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆర‌నివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి.

2. రాత్రి పడుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. డార్క్ సర్కిల్స్ ను దూరం చేయడానికి వాటిపై కొద్దిగా బాదం నూనె రాసి మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్ ను దూరం చేస్తుంది.

3. కీరదోసకాయ చర్మానికి చాలా లాభదాయకమైనది . డార్క్ సర్కిల్స్ ను తొలగించాలంటే కీరదోస రసాన్ని నిమ్మరసంతో మిక్స్ చేసి కళ్ల కింద అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

4. డార్క్ సర్కిల్స్ నుంచి బయటపడాలంటే రోజ్ వాటర్ లో పెరుగు, నిమ్మరసం మిక్స్ చేయాలి . దీన్ని కంటి చుట్టు వలయాల మీద అప్లై చేయాలి. ఈ పేస్ట్ ఎండిపోయిన తర్వాత మళ్లీ కడిగి మళ్లీ అప్లై చేసి కాసేపు ఆర‌నివ్వాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేయాలి.

IPL 2021 RCB vs SRH: ఆర్సీబీపై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌.. ఉమ్మడిగా రాణించిన బౌలర్లు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iGoqxP

0 Response to "Dark Circles: డార్క్ స‌ర్కిల్స్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..! అయితే బాదంతో ఇలా చేయండి .."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel