-->
Marakkar OTT: రూ. 100 కోట్ల చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.. మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’ చిత్రం ఏ ఓటీటీలో రానుందంటే..

Marakkar OTT: రూ. 100 కోట్ల చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.. మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’ చిత్రం ఏ ఓటీటీలో రానుందంటే..

Markkar Moive Ott

Marakkar OTT: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడడంతో చిత్ర పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అయితే ఇదే సమయంలో ఓటీటీ రంగం దూసుకొచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్లలో కాకుండా ఆన్‌లైన్‌లో అధికారికంగా సినిమా విడుదలవుతుందంటే పెద్ద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయింది. ఓటీటీలో విడుదల చేసేందుకే ప్రత్యేకంగా కొన్ని సినిమాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్‌లో విడుదల కావాల్సిన చిత్రాలు కూడా కరోనా కారణంగా ఓటీటీ బాటపట్టాయి. అయితే చిన్న చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు అయితే ఏమో అనుకోవచ్చు.. కానీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మరక్కార్‌’. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబపూర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ లాంటి భారీ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ 2019లో పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకే ఏడాది పట్టింది. తొలుత ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

సెకండ్‌ వేవ్‌ తర్వాత అయినా థియేటర్లలో విడుదల చేద్దా మనుకున్నారు. అయితే అప్పటికే కేరళలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం, థియేటర్‌ ఓనర్లు, పంపిణీదారులు ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ భారీ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకట వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: విజయ గర్జన కాదు.. వరంగల్‌లో కల్వకుంట్ల గర్జన పెట్టుకోండి.. ఈటల స్వాగత సభలో కిషన్ రెడ్డి ఎద్దేవా

Liquor Store Tenders: మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ విడుదల.. తేదీల వివరాలు ఇవే..

Prosenjit Chatterjee: స్విగ్గీలో ఆర్డర్‌ చేస్తే ఫుడ్‌ రాలేదు.. ప్రధాని మోడీకి, సీఎం మమతకు బెంగాల్‌ సూపర్‌స్టార్‌ లేఖ ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mTfpni

Related Posts

0 Response to "Marakkar OTT: రూ. 100 కోట్ల చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.. మోహన్‌లాల్‌ ‘మరక్కార్‌’ చిత్రం ఏ ఓటీటీలో రానుందంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel