
CSK vs KKR IPL 2021 Match Prediction: ధోని వర్సెస్ వెంకటేష్ అయ్యర్.. హోరాహోరీగా నేటి మ్యాచ్.. సమఉజ్జీల సమరంలో గెలిచేదెవరో?

IPL 2021, KKR vs CSK: అబుదాబిలో నేడు ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో భాగంగా 38వ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఇక్కడ ఇది వరకు ఆడిన రెండు మ్యాచుల్లో చెరో విజయం సాధించిన నేపథ్యంలో నేటి పోటీ చాలా హోరాహోరీగా ఉండబోతోంది. అయితే రెండో దశలో ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచులు ఆడి రెండింట్లోనూ విజయం సాధించడం విశేషం.
ఎప్పుడు: CSK vs KKR, సెప్టెంబర్ 26, మధ్యాహ్నం 03:30 గంటలకు
ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
పిచ్: పిచ్ విపరీతమైన తేమతో ఉంది. ఐపీఎల్ 2020 లో ఈ వేదికపై మధ్యాహ్నం ఆటలలో మొదట బ్యాటింగ్ చేసే టీంల సగటు స్కోరు 165గా నమోదైంది. ఇక్కడ ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది.
సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్ హెడ్-టు-హెడ్
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 16, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. యూఏఈలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచులను పరిశీలిస్తే.. ఇరు జట్లు 2 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీంలు తలో మ్యాచులో గెలిచాయి.
లైవ్ స్ట్రీమింగ్:
టీవీ – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
చెన్నై టీం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. ప్రస్తుం 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన చెన్నై టీం.. ఉత్తమంగా రాణిస్తోంది. బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీయడం, బ్యాటర్లు కూడా సమర్థంగా రాణించడంతో చెన్నై టీం అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 4 విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. యూఏఈలో రెండో దశలో భాగంగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ కీలక జట్లైన ముంబై, బెంగళూరు జట్లను ఓడించి, తమ సత్తా చాటారు.
ఇక్కడ వచ్చిన రెండు విజయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్త ప్లేయర్ వెంకటేష్ అయ్యర్.. ధాటిగా ఆడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
మీకు తెలుసా:
– రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు.
– ఐపీఎల్ 2021 భారత్‌లో ఆడిన మ్యాచుల్లో కేకేఆర్ పవర్‌ప్లేలో సగటు స్కోరు 44గా ఉంది. యూఏఈలో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో వీరి సగటు 60గా నమోదైంది.
– రవీంద్ర జడేజా కేకేఆర్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 371 పరుగులు చేశాడు. 41.22 సగటు, 134.91 స్ట్రైక్ రేట్‌తో పరగులు సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI అంచనా : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI అంచనా: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ
Baca Juga
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZxlD3f
0 Response to "CSK vs KKR IPL 2021 Match Prediction: ధోని వర్సెస్ వెంకటేష్ అయ్యర్.. హోరాహోరీగా నేటి మ్యాచ్.. సమఉజ్జీల సమరంలో గెలిచేదెవరో?"
Post a Comment