-->
SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!

SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!

Sbi 4

SBI YONO App: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. తన కస్టమర్ల సేవలకు స్వల్ప అంతరాయం కలిగే అవకాశం ఉందని ముందుగానే అలర్ట్ ప్రకటించింది. ‘‘ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి అనేక ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు నిర్వహణ పని కారణంగా సెప్టెంబర్ 4, 2021 న 22:35 గంటల నుండి మరియు సెప్టెంబర్ 5, 2021న 01:35 గంటల మధ్య అందుబాటులో ఉండవు.’’ అని వెల్లడించింది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారికంగా ట్వీట్ చేసింది. దాదాపు 180 నిమిషాల పాటు ఈ సేవలకు అంతరాయం కలిగింది.

‘‘మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి మేం కృషి చేస్తున్నందున మా గౌరవనీయ కస్టమర్లు మాకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాము. ఎస్‌బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి అనేక ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు నిర్వహణ పని కారణంగా సెప్టెంబర్ 4, 2021 న 22:35 గంటల నుండి మరియు సెప్టెంబర్ 5, 2021న 01:35 గంటల మధ్య అందుబాటులో ఉండవు. అసౌకర్యానికి చింతిస్తున్నాము.’’ అంటూ ట్వీట్ చేసింది.

Also read:

Kcr-Modi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 50 నిమిషాల ఈ భేటీలో దేని గురించి చర్చించారంటే..

IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్..

Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి ఆందోళన.. ఎందుకో తెలుసా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3h3AKaC

Related Posts

0 Response to "SBI YONO App: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. ‘యోనో’ యాప్ ఈ సమయంలో పని చేయదు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel