
Used Cooking Oil: ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలకే పెను ముప్పు..!

Used Cooking Oil: సందర్భం ఏదైనా ఇంట్లో వంటకాలు చేయడం కామన్. రోజూ వారీగా చేసే వంటలు మొదలు.. ప్రత్యేక సందర్భాల్లో చేసే వంటల వరకు ప్రతీసారి వంట నూనె ఉపయోగించాల్సిందే. నూనె వేయకుండా ఏ వంట కూడా చేయలేని పరిస్థితి. అయితే, చాలా మంది వంటలు చేసేప్పుడు అధికంగా నూనెను పాన్‌లలో వేస్తుంటారు. ఎక్కువైన నూనె తిరిగి వినియోగించేందుకు దాచిపెడతారు. అలా వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. పూరీలు, పరాఠాలు, బజ్జీలు ఇలా వంటకాల కోసం వినియోగించిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు. అయితే, ఇలా వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? దాని పర్యావసానల వల్ల ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఉపయోగించిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ప్రాణాంతకమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని తినడం ద్వారా, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కారణంగా, అధిక బిపి, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
2. ఉపయోగించిన వంట నూనె గుండెకు హాని కలిగించే ఆల్జీమర్స్, స్ట్రోక్, క్యాన్సర్, పార్కిన్సన్స్, కాలేయ సమస్యల ప్రమాదాన్ని పెంచే ఆల్డిహైడ్స్ వంటి అనేక విషపదార్థాలను విడుదల చేస్తుంది.
3. మీకు తరచుగా గ్యాస్ వస్తే లేదా కడుపులో మంటగా అనిపిస్తే, దీనికి కారణం వంట నూనె అని చెప్పాలి. వీధి ఆహారం, రెస్టారెంట్లలో ఒకసారి ఉపయోగించిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అందుకే బయట ఆహారం తినడం వల్ల తరచుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటారు.
4. మీరు అధిక బీపీతో బాధపడుతున్నట్లయితే.. ప్రత్యేకంగా ఉపయోగించిన వంట నూనె వాడకాన్ని నివారించాలి. లేదంటే మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
మరి ఏం చేయాలి..?
వంట చేసేటప్పుడు.. ఆ వంటకు సరిపడా నూనె మాత్రమే వేయండి. ఒకవేళ ఆయిల్ మిగిలినట్లయితే ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఇంటి తలుపులు, తాళాలు తుప్పు పట్టకుండా కాపాడటానికి దీనిని ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించిన నూనె మరియు వెనిగర్ మిశ్రమంతో చెక్క ఫర్నిచర్‌ను పాలిష్ చేయవచ్చు.
పొద్దుతిరుగుడు, ఆవాలు, సోయాబీన్ నూనె, వేరుశెనగ లేదా నువ్వుల నూనెను ఉపయోగించండి. కూరగాయలు వేయించడానికి నెయ్యి, కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. అయితే, మళ్లీ మళ్లీ దానినే వినియోగించడం సరికాదని గుర్తుంచుకోవాలి.
Also read:
Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zP4iA0
0 Response to "Used Cooking Oil: ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్రాణాలకే పెను ముప్పు..!"
Post a Comment