
Warangal: బంధువులను బినామీలుగా పెట్టి భూమి డబుల్ రిజిస్ట్రేషన్.. ఇద్దరు సీఐలపై కేసులు నమోదు..

భూవివాదానికి సంబంధించి వరంగల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై కేసులు నమోదయ్యాయి. భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై అజయ్‌కుమార్, నవీన్‌కుమార్ అనే ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా గతంలో ఇదే కాజీపేట పోలీస్ స్టేషన్‌లో సీఐగా అజయ్‌కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బయ్యపల్లిలో సర్వే నంబర్ 83లో 20 కుంటల భూమిపై అజయ్‌కుమార్, నవీన్ కుమార్‌ల కన్ను పడింది. తమ పేర్లు బయటకు రాకుండా ఏకంగా బంధువులను బినామీగా పెట్టారు. వారి పేర్లతోనే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు.
కాగా తమ భూమి కబ్జాకు గురైందన్న విషయం తెలుసుకున్న అసలు యజమానులు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఇద్దరు పోలీసు అధికారుల భూభాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీస్ స్టేషన్‌లో అజయ్‌కుమార్, నవీన్‌కుమార్‌లపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:
Crime News: అనుమానమే పెనుభూతమై ప్రాణాలు తీసింది.. అర్ధరాత్రి ఆ ఇంట్లో అసలేం జరిగింది..?
Shocking News: భర్త నచ్చలేదని అర్ధరాత్రి దురాగతం.. సలసల మరిగే నూనెతో భార్య ఏం చేసిందంటే..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GPxfih
0 Response to "Warangal: బంధువులను బినామీలుగా పెట్టి భూమి డబుల్ రిజిస్ట్రేషన్.. ఇద్దరు సీఐలపై కేసులు నమోదు.."
Post a Comment