
Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..

పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లే.. అంటూ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు… నేడు (17న )విడుదల అవుతుంది. తెలంగాణలో పుష్ప సినిమాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ముందునుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది. ఈ మాస్ బీట్‌కు ఫిదా అవుతున్నారు.
కోవిడ్ టైమ్‌లో డిజిటల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన నటుడు ఫాహద్ ఫాజిల్. అప్పటి వరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్.. లాక్ డౌన్ టైమ్‌లో నేషనల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ టాప్ హీరో పుష్ప సినిమా కోసం రూత్‌లెస్ విలన్‌గా మారారు. ఇక థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F7fRFj
0 Response to "Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్.."
Post a Comment