-->
Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold And Silver

Gold and Silver Price Today: దేశీయంగా బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి. భారతీయులు ఏ చిన్న సందర్భం వచ్చినా వెంటనే బంగారం నగలు కొనుగోలు పై ఆసక్తిని చూపిస్తారు. వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి వస్తువులను ఖరీదు చేయాలనుకుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజు రోజుకీ పైపైకి పెరిగాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ఆల్ టైం హై కి చేరుకున్నాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో నేటి బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గ్రాము ధర గురువారం రూ. 4,910 లు ఉండగా శుక్రవారం ఉదయానికి రూ. 32 లు పెరిగి ఈరోజు రూ. 4,942లకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 49,100 లు ఉంది. అయితే ఈరోజు రూ. 320 లు మేర పెరగడంతో డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం ఉదయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 49,420 లు గా నమోదైంది.

ఇక నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల  గ్రాము  బంగారం ధర గురువారం రూ. 4,500 లు ఉండగా ఈరోజు ఉదయానికి (డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం ఉదయానికి) రూ.30 మేర పెరిగింది. దీంతో ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,530లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర గురువారం రూ. 45,000ఉండగా.. నేడు రూ. 300 మేర పెరిగి రూ. 45,300లకు చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు:

ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర రూ.209 లాభంతో 10 గ్రాములకు రూ.47,405 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.47,196 వద్ద ముగిసింది.

పశ్చిమ బెంగాల్ రాజధాని, మహానగరం కోల్‌కతాలో బంగారం ధర 10 గ్రాములకు రూ.61,400గా ఉంది.

దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.49,000గా ఉంది.

వెండి ధరలు: మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా బహుమతులు ఇవ్వడానికి వెండి వస్తువులను ఎంపిక చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మనదేశంలో కిలో వెండి ధర ఎలా ఉన్నదంటే.. గురువారం కిలో వెండి ధర రూ.  61,400 లు ఉండగా ఈరోజు ఉదయానికి రూ.500 మేర పెరిగి 60,900 లకు చేరుకుంది.

Also Read:

 భగవంతుడి సేవలో తరించిన గోదా దేవి జీవిత చరిత్ర.. దివ్య ధనుర్మాస విశిష్టత

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/33rDZo8

Related Posts

0 Response to "Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel