
Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో అదే హైలైట్ కానుందట..

Shyam Singha Roy: న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా పై నాని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాని సినిమా థియేటర్స్ లో వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అవుతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన వి సినిమా ఓటీటీ వేదికగానే విడుదలైంది. ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు..
ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమాకూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకొలేక పోయింది. ఈ సినిమా నాని రెండు విభిన్న మైన పాత్రల్లో కనిపించనున్నాడు. కలకత్తాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రెండు కాలాలకు సంబంధించిన కథకు స్క్రీన్ ప్లే ప్రాణంగా కనిపిస్తుంది. ఇక బెంగాలి చీరకట్టులో సాయిపల్లవి కనిపించనుండటం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ రెండు కాలాలకి సంబంధించిన లింక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, సిరివెన్నెల రెండు పాటలు అందించారు. ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Pushpa Movie Twitter Reviews: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప
Pushpa Movie Release Live: మొదలైన పుష్ప రాజ్ బాక్సాఫీస్ వేట.. థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్న ఫ్యాన్స్..
AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’తో ప్రేక్షకుల ముందుకు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3e2jGQl
0 Response to "Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో అదే హైలైట్ కానుందట.."
Post a Comment