-->
Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ దాడి.. విజయ్‌ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు..

Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ దాడి.. విజయ్‌ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు..

గత నెలలో జాతీయ అవార్డు అందుకుని వస్తోన్న విజయ్‌ సేతుపతిపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒకరు దాడి చేసిన సంగతి తెలిసిందే. మక్కల్‌ సెల్వన్‌ని తన్నేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. కాగా విజయ్‌పై దాడిచేసిన వ్యక్తిపేరు మహా గాంధీ అని తర్వాత తెలిసింది. అయితే విజయ్‌ బృందమే తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు చెన్నై సైదా పేట మెట్రో పాలిటన్‌ కోర్టు విజయ్‌ సేతుపతితో పాటు అతని మేనేజర్‌ జాన్సన్‌లకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 2న దీనిపై విచారణ జరగనుంది.

చెన్నై ఎయిరోపోర్టులో విజయ్‌ని చూసిన మహా గాంధీ సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడని, ఈ సందర్భంగా విజయ్‌ బృందంలోని ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించాడని మహా గాంధీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే విజయ్‌ టీంకు, తనకు మధ్య గొడవ జరిగిందన్నాడు. ఈ వాగ్వాదం అనంతరం బెంగళూరు విమానాశ్రయం వెలుపల విజయ్‌ మేనేజర్‌ జాన్సన్ తనపై దాడి చేసినట్టు మహాగాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశాడు. కాగా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ ఘటన తర్వాత విజయ్‌ను తన్నిన వారికి ప్రతీసారీ రూ.1001 బహుమతిగా చెల్లిస్తానని హిందూ మక్కల్‌ కట్చి నాయకుడు అర్జున్‌ సంపత్‌ ప్రకటించాడు. ఈ విషయమై పోలీసులు అర్జున్‌పై కేసు కూడా నమోదు చేశారు.

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31Yr3pt

Related Posts

0 Response to "Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ దాడి.. విజయ్‌ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel