
Viral Video: వివాహ వేడుకలో వధూవరుల అత్యుత్సాహం.. గాలిలోకి 4 రౌండ్ల కాల్పులు.. పోలీసుల ఎంట్రీతో..

UP Couple Firing in Air at Wedding: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి వేడుకలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించింది. వధూవరులు ఇద్దరు అదే తుపాకీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో పెళ్లి సందర్భంగా కాల్పులు జరిపిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కొత్తగా పెళ్లయిన వధూవరులు 4 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. పెళ్లి వేడుకలలో గాలిలోకి ఈ జంట కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
వాస్తవానికి, ఈ 10 సెకన్ల వీడియో డిసెంబర్ 9న ఘజియాబాద్‌లోని సూర్య ఫామ్ హౌస్‌లో వివాహ సమయంలో జరిగింది. వధూవరులు ఒక వేదికపై కలిసి నిలబడి ఉండగా, వరుడి చేతిలో పిస్టల్ కూడా కనిపిస్తుంది. తన స్థాయిని చూపించడానికి, వధువును సంతోషపెట్టడానికి, వరుడు గాలిలో 4 రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల్లో వధువు కూడా వరుడికి మద్దతుగా నిలుచింది. అదే సమయంలో పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న జనాలు వరుడి చర్య చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విషయం వెలుగులోకి రావడంతో ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, వరుడి కోసం వెతకడం ప్రారంభించారు.
డిసెంబర్ 13న సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో మా దృష్టికి వచ్చిందని పోలీసు అధికారి స్వతంత్ర సింగ్ తెలిపారు. ఈ కాల్పుల వీడియోపై ఘజియాబాద్ కొత్వాలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇది కాకుండా పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు పెళ్లి సమయంలో వధూవరులు వేదికపై కాల్పులు జరుపుతున్న వీడియో ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడింది.
शादी के जोश में खोया होश,दूल्हा दुल्हन पर कानूनी कार्रवाई की तैयारी,ग़ाज़ियाबाद के घंटाघर का मामला pic.twitter.com/aTeoI2xcZD
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) December 14, 2021
Read Also… Ankita Lokhande: పెళ్లి పీటలెక్కిన సుశాంత్ మాజీ ప్రేయసి.. వేడుకగా అంకిత, విక్కీల వివాహం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EZZj1S
0 Response to "Viral Video: వివాహ వేడుకలో వధూవరుల అత్యుత్సాహం.. గాలిలోకి 4 రౌండ్ల కాల్పులు.. పోలీసుల ఎంట్రీతో.."
Post a Comment