
IND vs PAK: హిట్‌మ్యాన్‌ను అలా ఔట్ చేయమని చెప్పింది నేనే.. అతడి వీక్‌నెస్ నాకు తెలుసు: పీసీబీ ఛీప్ కొత్త వాదన

India vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. కానీ, పాకిస్తాన్‌లో ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి, పాకిస్తాన్ మొదటిసారి ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించింది. అందుకే దాని మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ఓ పెద్ద ప్రకటన చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఔట్ చేయాలనే ప్లాన్‌ను బాబర్ ఆజంకు చెప్పానని రమీజ్ రాజా పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మను షాహీన్ అఫ్రిది తొలి బంతికే అవుట్ చేయడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అక్టోబర్ 24కి ముందు రోహిత్ శర్మ వికెట్ కోసం ప్లాన్ వేసినట్లు పీసీబీ చీఫ్ రమీజ్ రాజా తెలిపారు. రోహిత్ శర్మ ముందు షాహీన్ ఆఫ్రిదిని మాత్రమే ఉంచి, భారత బ్యాట్స్‌మెన్‌ను ఇన్-స్వింగ్ యార్కర్లు వేయమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజంతో రమీజ్ రాజా పేర్కొన్నట్లు తెలిపాడు.
రమీజ్ రాజా ఆసక్తికరమైన వాదన..
బీబీసీ పోడ్‌కాస్ట్‌లో రమీజ్ రాజా మాట్లాడుతూ, ‘భారత్‌పై మీ ప్రణాళికలు ఏమిటి అని నేను బాబర్ ఆజంను అడిగాను. బాబర్ తన ప్రణాళికను రూపొందించాడని, క్రికెట్ గణాంకాలను కూడా ఆశ్రయిస్తున్నట్లు చెప్పాడు. భారతదేశం కూడా గణాంకాల సాయం తీసుకుంటుందని బదులిచ్చాను. రోహిత్ శర్మను అవుట్ చేసేందుకు బాబర్ ఆజంతో కలిసి ప్లాన్ చేశాను. షాహీన్ ఆఫ్రిదిని బౌలింగ్‌లో ఉంచి, 100 మైళ్ల వేగంతో యార్కర్లు వేయమని బాబర్ ఆజంతో చెప్పాను. షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్‌ని రోహిత్ ముందు ఉంచితే, అతని వికెట్ దొరుకుతుందని తెలిపినట్లు పేర్కొన్నాడు. రమీజ్ రాజా పాకిస్తాన్ తరుపున 1997 సంవత్సరంలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
గోల్డెన్ డక్‌లో రోహిత్ ఔటయ్యాడు..
దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, షహీన్ ఆఫ్రిది మ్యాచ్ నాలుగో బంతికి రోహిత్ శర్మ వికెట్ పడగొట్టాడు. షాహీన్ ఆఫ్రిది స్వింగ్ యార్కర్‌ను రోహిత్ గుర్తించలేకపోయాడు. బంతి అతని ప్యాడ్‌కు తగిలింది. అంపైర్ రోహిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. మొత్తం 3 వికెట్లు అతని ఖాతాలో చేరగా షాహీన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నమెంట్‌లో, పాకిస్తాన్ ఒక్క లీగ్ మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అయితే నాకౌట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. చివరకు న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
Shaheen Afridi, you beauty
What a peach of a delivery as Rohit Sharma is gone for a
© @ICC #T20WorldCupsquad #INDvPAK pic.twitter.com/fUrRE18yNX
— Malik Ali Raza (@MalikAliiRaza) October 24, 2021
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3IwZpk3
0 Response to "IND vs PAK: హిట్‌మ్యాన్‌ను అలా ఔట్ చేయమని చెప్పింది నేనే.. అతడి వీక్‌నెస్ నాకు తెలుసు: పీసీబీ ఛీప్ కొత్త వాదన"
Post a Comment