-->
Pain-Urinating: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉందా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణమే.. తస్మాత్ జాగ్రత్త..!

Pain-Urinating: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉందా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణమే.. తస్మాత్ జాగ్రత్త..!

Health

Pain-Urinating: తరచుగా మూత్రం రావడం, మూత్రవిసర్జన సమయంలో పొత్తి కడుపులో నొప్పి అనిపించడం జరుగుతుందా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఇది తీవ్రమైన మూత్రపిండ వ్యాధి లక్షణం కావొచ్చు. ఈ వ్యాధిని వైద్య భాషలో హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఈ వ్యాధి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ దశ అని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.

మూత్రనాళానికి సంబంధించిన ఏదైనా సమస్య ఈ వ్యాధికి కారణమవుతుందని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ హిమాన్షు వర్మ చెబుతున్నారు. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. అయితే, కొన్నిసార్లు ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల మూత్రాన్ని బయటకు పంపే ప్రక్రియ సరిగా సాగదు. దాంతో మూత్రం బయటకు రాదు. కిడ్నీల్లోనే పేరుకుపోతుంది. ఇది హైడ్రోనెఫోసిస్‌కు కారణమవుతుంది. కొంతకాలం పాటు ఈ వ్యాధి ఇలాగే ఉంటే.. మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ వస్తుంది.

కిడ్నీ చెడిపోవడం..
హైడ్రోనెఫోసిస్ వల్ల మూత్రపిండంలో మూత్రం పేరుకుపోతుందని డాక్టర్ హిమాన్షు చెప్పారు. దీని కారణంగా కిడ్నీ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి ఎక్కువ అవుతుందంటే.. మూత్రవిసర్జన సమయంలో కడుపులో నొప్పిగా ఉంటుంది. చాలా మంది తరచుగా మూత్రవిసర్జన గురించి ఫిర్యాదు చేస్తుంటారు. దీంతో పాటు, గ్యాస్, జ్వరం లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ ప్రారంభంలోనే కనిపిస్తాయి అని డాక్టర్ తెలిపారు. కాబట్టి, వాటిని సకాలంలో గుర్తించి చికిత్స అందించాలి.

కిడ్నీ స్టోన్‌కి సంకేతం..
కిడ్నీలో రాళ్లు ఉన్నా కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ తెలిపారు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT), అల్ట్రాసౌండ్ ద్వారా దీనిని చెక్ చేయవచ్చు. ఈ లక్షణాలే కాకుండా మూత్రం రంగులో మార్పు వచ్చినా, మూత్ర విసర్జన సమయంలో దుర్వాసన వస్తున్నా కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లుగా భావించాలని, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలా జాగ్రత్త పడండి..

కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర, నూనె వాడకాన్ని తగ్గించండి. సంవత్సరానికి ఒకసారి మీ కిడ్నీ పని తీరును చెక్ చేసుకోండి.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GfIVut

Related Posts

0 Response to "Pain-Urinating: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉందా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణమే.. తస్మాత్ జాగ్రత్త..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel