-->
CM KCR Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఎందుకంటే..?

CM KCR Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఎందుకంటే..?

Kcr2

CM KCR Districts Tour: తెలంగాణ ముఖ్యమంతరి కే.చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది. ఈ నెల 23 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తారు. 23న వనపర్తి జిల్లాలో సీఎం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నాలుగు జిల్లాల్లో సీఎం పర్యటించారు. గురువారం వనపర్తిలో పర్యటించనున్న సీఎం.. నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డును, రెండు పడకల గదుల ఇళ్లను కూడా ప్రారంభిస్తారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే. జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్… పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొంటారని సీఎంవో కార్యాలయం తెలిపింది. తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ దళితబంధుతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో భేటీకానున్నారు. దళితబంధు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే సమావేశంలో మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఇక వికారాబాద్‌, జనగామతో పాటు త్వరలోనే పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

ఖమ్మం నేతలతో సీఎం భేటీ

మరోవైపు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఖమ్మం నా దత్త జిల్లా. ఎన్ని కావాలంటే అన్ని నిధులు మంజూరు చేస్తా. సీతారామ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసుకుందామని సీఎం కేసీఆర్ తెలిపారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.700 నుంచి రూ. 800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యేకు రూ. 70 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా నాయకత్వం అంతా కలిసికట్టుగా పని చేయాలన్న సీఎం.. ఈ తరహా రాజకీయాలు అవసరం లేదు. కొత్త రాజకీయలు చూపిస్తామన్నారు. పార్టీ నుంచి ఎవరినీ తీసెసేది లేదు. చెడగొట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దు. వాళ్లను పార్టీ కార్యక్రమాలకు పిలవద్దు. పార్టీలో ఉంటే ఉంటారు. పోతే పోతారు. టీఆర్ఎస్ పార్టీని వాళ్ల కోసం నడపడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

Read Also… Uttarpradesh: యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3sgODZl

0 Response to "CM KCR Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఎందుకంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel