
Viral Video: కసరత్తులు చేద్దామనుకున్నాడు.. కానీ… వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఫన్నీ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అయిన వీడియోను చూస్తే మీరు అస్సలు నవ్వు ఆపుకోకుండా ఉండలేరు. ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వ్యాయామం మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్‌గా ఉంచుతుంది. అందుకే చాలామంది ప్రతిరోజూ కొంతసమయాన్ని వ్యాయామానికి కెటాయిస్తుంటారు. అయితే.. ఇలాంటి సమయాల్లో కొన్ని కసరత్తులు కూడా చేస్తుంటారు. అలా చేస్తూ అనవసరంగా ఇబ్బందుల్లో కూరుకుపోతారు. తాజాగా వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి బెంచ్‌పై కూర్చొని వ్యాయామం చేస్తుంటాడు.. ఈ క్రమంలో జరిగిన సన్నివేశం అందరినీ తెగ నవ్విస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో బెంచ్‌పై ఒక వ్యక్తి కూర్చుని కసరత్తులు చేస్తుంటాడు. బెంచ్‌పై కూర్చొని.. మెడను వెనుకకు వాల్చుతాడు. ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోతాడు. అయితే.. పడిన వెంటనే ఎవరైనా చూశారేమో అనుకొని.. ఒకసారి చుట్టూ పరికించి వెంటనే లేచి మళ్లీ ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభిస్తాడు. అయితే.. దీన్ని చూసిన తర్వాత నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి చూడండి.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను వీక్షిస్తున్న వేలాది మంది లైక్ చేస్తున్నారు. రకరకాలుగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో నిజంగా ఫన్నీగా ఉందని.. అనవసర కసరత్తులు ఇలాగే ఇబ్బందుల్లో పడేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/33d86ja
0 Response to "Viral Video: కసరత్తులు చేద్దామనుకున్నాడు.. కానీ… వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!"
Post a Comment