-->
Uttarpradesh: యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం

Uttarpradesh: యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం

Modi

Uttarpradesh: త్వరలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ భారీ కానుక ఇస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.50 గం. ప్రధాని మోడీ రోజా రైల్వే గ్రౌండ్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. షాజహాన్‌పూర్‌లో దాదాపు గంటపాటు ప్రధాని మోడీ పాల్గొంటారు. అదే సమయంలో, ప్రధాని మోడీ ర్యాలీలో  షాజహాన్‌పూర్, హర్దోయ్, బదౌన్ , లఖింపూర్ వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షమంది ప్రజలు పాల్గొననున్నారని అంచనా వేస్తున్నారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే కు శంకుస్థాపన చేయడానికి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ కి రాష్ట్ర గవర్నర్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలకనున్నారు. అదే సమయంలో ఈరోజు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులు హాజరుకానున్నారు. సమాచారం ప్రకారం, మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు నిర్మించే 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2024 సంవత్సరంలో పూర్తవుతుంది. మీరట్‌లోని బిజౌలీ గ్రామం నుండి ప్రారంభించి, ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామానికి చేరుకునే వరకు, 12 జిల్లాలోని 30 ప్రాంతాలను కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సాగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ. 36,230 కోట్లు.  దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) కింద నిర్మించనున్నారు. అదే సమయంలో, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యుపిఇడిఎ) భూమి దస్తావేజు పొందే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది.

అయితే, ప్రధాని అయిన తర్వాత మోడీ రెండోసారి షాజహాన్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. 2018లో రైతుల సంక్షేమ ర్యాలీలో ప్రసంగించేందుకు వచ్చారు. రెండోసారి గంగా ఎక్స్‌ప్రెస్‌వే శంకుస్థాపనకు వెళ్లానున్నారు. సమాచారం మేరకు ప్రధాని మోడీ విమానం బరేలీలోని త్రిశూల్ ఎయిర్‌బేస్‌కు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రధాని  హెలికాప్టర్‌లో బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు వైమానిక దళం హెలికాప్టర్‌లో బరేలీ నుంచి రోసా రైల్వే గ్రౌండ్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ అక్కడ గంట 20 నిమిషాల పాటు బస చేయనున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.

Also Read:

పెరిగిన బంగారం, వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F8URhw

Related Posts

0 Response to "Uttarpradesh: యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel