-->
Tamannaah Bhatia : సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతున్న మిల్కీ బ్యూటీ..

Tamannaah Bhatia : సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతున్న మిల్కీ బ్యూటీ..

Thamanna

Tamannaah Bhatia : మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. ఈ  చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక తమన్నా, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది.

అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తమన్నా అటు యంగ్ హీరోలతో ఆటు కుర్ర హీరోలతోనూ నటిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ భామ సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాన్స్ అవుతుంది. అయితే తమన్నాకు ఇటీవల సినిమాలు తగ్గాయని టాక్ చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. ఇప్పుడు సీనియర్ హీరోలతో జత కడుతుంది. ఇప్పటికే నటించిన ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. ఇప్పుడు ఎఫ్ 3లో కూడా  నటిస్తుంది. ఇక మెగాస్టార్ నటించిన సైరలో చేసింది తమన్నా ఇక ఇప్పుడు భోళాశంకర్ సినిమాలో ఎంపిక అయ్యింది. దాంతో మిల్కీ బ్యూటీ సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాన్స్ అవుతుందని ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మరి ముందు ముందు కూడా సీనియర్ హీరోల సినిమాలో తమన్నా నటిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3C5Zg2d

0 Response to "Tamannaah Bhatia : సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతున్న మిల్కీ బ్యూటీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel