
Akash Puri: సినిమా చివరివరకు మా అమ్మ ఏడుస్తూనే ఉంది.. ఆకాష్ పూరి ఎమోషనల్ కామెంట్స్..

Akash Puri: యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రొమాంటిక్ చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ..
‘నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నన్ను అందరూ అంగీకరించే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్, హ్యాపీ, ఫన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తాను. నేను మొదటి సారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను. నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను అని అనుకున్నాను. కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కథను నమ్మి చేశాం. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. అంతా చూశాక.. ఇంత బాగా ఎలా నటించావ్‌రా అని అన్నారు. నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించారు. నాన్న గారు చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగిరేస్తారు. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను’ అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..
Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం
SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ohDpQy
0 Response to "Akash Puri: సినిమా చివరివరకు మా అమ్మ ఏడుస్తూనే ఉంది.. ఆకాష్ పూరి ఎమోషనల్ కామెంట్స్.."
Post a Comment