-->
Sreemukhi: అప్పట్లో మంచు లక్ష్మి… ఇప్పట్లో శ్రీముఖి… ఆహా ఏమి రుచి!

Sreemukhi: అప్పట్లో మంచు లక్ష్మి… ఇప్పట్లో శ్రీముఖి… ఆహా ఏమి రుచి!

Sreemukhi

బుల్లితెర మీదే కాదు డిజిటల్‌ స్క్రీన్స్‌ మీద కూడా కిచెన్‌ ప్రోగ్రామ్స్‌ వేడివేడిగా వర్కవుట్ అవుతున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి స్టార్‌డమ్‌తో మెరిసిన వంటల ప్రోగ్రామ్స్‌ని చూసిన తెలుగు ప్రేక్షకులు… ఓటీటీల్లో అంతకుమించిన టేస్ట్‌ లెవల్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా ఆహా భోజనంబు పేరుతో ఆహా యాప్‌లో స్ట్రీమ్ అయిన కార్యక్రమం మంచి ప్రశంసల్ని దక్కించుకుంది. హోస్ట్‌గా మంచు లక్ష్మి సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. స్మాల్ అండ్ మీడియం హీరోహీరోయిన్లను గెస్ట్‌లుగా పిలిచి.. వంటలు చేయించి… మధ్యమధ్యలో మాటలు కలిపి… ఆహా ఏమి రుచి అనిపించారు మంచు లక్ష్మి. ఇక… ఇప్పుడు బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి వంతొచ్చింది. ఇదే ఆహాలో శ్రీముఖి హోస్ట్ చేస్తున్న తాజా వంటల కార్యక్రమం… చెఫ్ మంత్ర.

చెఫ్ మంత్ర ఫస్ట్ ఎపిసోడే వీర లెవల్లో ఎంటర్‌టైన్ చేయనుంది. శ్రియా శరణ్, సుహాస్, రెజీనాలతో కలిసి శ్రీముఖి చేసిన రుచికరమైన వంటలతో పాటు తియ్యతియ్యటి అల్లరి కూడా ఈ ఎపిసోడ్‌లో సూపర్‌ స్పెషాలిటీస్. స్ట్రీమింగ్ డేట్ చెప్పకుండా కమింగ్ సూన్ అంటూ ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. సో… ఇక శ్రీముఖి మేజిక్‌ని డిజిటల్ ఆడియన్స్‌ కూడా ఎంజాయ్ చెయ్యబోతున్నారన్నమాట.

Byline: Srihari Raja, ET

Also Read: NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kxN6cu

Related Posts

0 Response to "Sreemukhi: అప్పట్లో మంచు లక్ష్మి… ఇప్పట్లో శ్రీముఖి… ఆహా ఏమి రుచి!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel