
Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. అమిత్‌షాతో కలిసి శ్రీవారి దర్శనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఖరారైంది. శని, ఆదివారాల్లో ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి సీఎం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం జగన్ నేడు(శనివారం) సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలు దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో తిరుపతి తాజ్ హోటల్‌లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న అమిత్‌షాకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్లి రాత్రి 9.30గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆపై జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలు దేరతారు.
ఆదివారం కూడా..
ఆదివారం కూడా తిరుపతిలో జగన్ పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్‌లో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అమిత్‌షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సమావేశం అనంతరం జగన్, అమిత్‌షా ప్రత్యేక విందులో పాల్గొననున్నారు.
Also Read:
Sajjala: ‘ఏపీ ఎలా పోతుందో మీకెందుకు ?’.. తెలంగాణ మంత్రి కామెంట్స్‌కు సజ్జల కౌంటర్
AP Industries Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kxwx0F
0 Response to "Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. అమిత్‌షాతో కలిసి శ్రీవారి దర్శనం"
Post a Comment