
Naga Shourya farm house case : ముగిసిన గుత్తా సుమన్ రెండు రోజుల కస్టడీ.. విచారణలో విస్తుపోయే నిజాలు..

హీరో నాగశౌర్యకు చెందిన మంచి రేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ రెండు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిని ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఫామ్‌హౌస్ పేకాట కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న పోలీసులు అతడిని చంచల్ గూడ జైలులో ఉంచి దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణలో గుత్తా సుమన్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సుమన్ లిస్ట్ లో ఉన్న పలువురు ప్రముఖుల లిస్ట్ చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో అతడికున్న సంబంధాలపై అరా తీసే ప్రయత్నం చేశారు. విచారణంలో భాగంగా గతంలో సుమన్ నిర్వహించిన పార్టీకి సహకరించిన వారి వివరాలను రాబట్టారు. అయితే నాగశౌర్య, అతని తండ్రి, బాబాయి గురించి సుమన్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్ రియల్టర్‌గా, బిజినెస్‌మెన్‌గా అవతారమెత్తాడు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కాంట్రాక్టుల పేరుతో పలువురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఇక మంచిరేవుల పార్టీ తర్వాత 50మందిని రష్యా క్యాసినోకి తీసుకెళ్లేందుకు కూడా సుమన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే విచారణకు హాజరుకావాలని నార్సింగి పోలీసుల జారీ చేసిన నోటీసులకు హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇంతవరకు స్పందించలేదు. ఈరోజు విచారణకు తుది గడువు. ఈరోజు సాయంత్రంలోగా రవీంద్ర ప్రసాద్ విచారణకు హాజరు కాకపోతే వారెంట్ తప్పదని పోలీసులు చెబుతున్నారు.
Also Read:
Old City Blast: హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..
Road Accident: నడి రోడ్డుపై కారు బీభత్సం.. ఇద్దరు యువకుల దుర్మరణం..
Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GRWaTj
0 Response to "Naga Shourya farm house case : ముగిసిన గుత్తా సుమన్ రెండు రోజుల కస్టడీ.. విచారణలో విస్తుపోయే నిజాలు.."
Post a Comment