
Anantapur district: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు మృతిచెందారు. పామిడి శివారులో నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కూలీల ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి(40) గా గుర్తించారు. ప్రమాదతీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతిదేహాలను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ తప్పిదం కారణంగానే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
మిడుతూరు వద్ద కూడా వద్ద ప్రమాదం
పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ప్రమాదం జరిగింది. మిడుతూరు వద్ద నేషనల్ హైవేపై కారు పాదాచారులపై దూసుకెళ్లిన ఘటనలో యాకోబ్(62), నారాయణ(60) అనే వ్యక్తులు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. ఏడుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకుంది.
Also Read: పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చలేదని చెప్పిన యువతి… అతడు చేసిన పని కనీసం మీరు ఊహించలేరు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CJ7AGq
0 Response to "Anantapur district: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి"
Post a Comment