
Terrorist on USA: ఆరు నెలల్లో అమెరికాపై ఉగ్రదాడి.. బీకేర్ ఫుల్ అంటున్న నిఘా వర్గాలు.! అన్ని క్లిప్స్ ఒకే వీడియోలో..

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాయి నిఘా వర్గాలు. ఆరు నెలల్లో ఆ దేశంలోని ఇస్లామిక్ స్టేట్ దాడికి యత్నించే అవకాశముందని హెచ్చరించాయి. అఫ్గాన్‌లో సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందంటూ అఫ్గాన్ నుంచి వెళ్లిపోయింది అమెరికా. దీంతో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు మళ్లీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇటు ఆఫ్ఘన్‌లోని తాలిబన్లు సైతం ఇస్లామిక్ స్టేట్ చర్యలను వ్యతిరేకిస్తోంది. ఇటీవల దేశంలో జరిపిన మారణకాండను సైతం ఖండించింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని తాలిబన్ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే అది సాధ్యమయ్యే పనేనా అన్నది సందేహం కలగకమానదు. ఎందుకంటే.. అనేక మంది ఉగ్రవాదుల సమూహమే ఐఎస్. దీన్ని కట్టడి చేయాలంటే తాలిబన్ ప్రభుత్వానికి సాధ్యపడదు. అంతేకాకుండా తమ ఉనికిని చాటి చెప్పేందుకు ఐఎస్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాపై ఉగ్రదాడికి సిద్ధమౌతుందని తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EPrhge
0 Response to "Terrorist on USA: ఆరు నెలల్లో అమెరికాపై ఉగ్రదాడి.. బీకేర్ ఫుల్ అంటున్న నిఘా వర్గాలు.! అన్ని క్లిప్స్ ఒకే వీడియోలో.."
Post a Comment