
Bangarraju Movie : బరిలోకి దిగడానికి ‘బంగార్రాజు’ సిద్దమయ్యాడు.. లిరికల్ సాంగ్ తో రచ్చ చేయనున్న నాగ్..

Bangarraju Movie: నాగార్జున, రమ్యకృష్ణ కలసి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..
Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..
Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3woSweI
0 Response to "Bangarraju Movie : బరిలోకి దిగడానికి ‘బంగార్రాజు’ సిద్దమయ్యాడు.. లిరికల్ సాంగ్ తో రచ్చ చేయనున్న నాగ్.."
Post a Comment