-->
Ravi Teja: మారెడుమిల్లిలో అడవుల్లో మాస్ మహారాజా రవితేజ.. శరవేగంగా రామారావు ఆన్ డ్యూటీ..

Ravi Teja: మారెడుమిల్లిలో అడవుల్లో మాస్ మహారాజా రవితేజ.. శరవేగంగా రామారావు ఆన్ డ్యూటీ..

Ravi Teja

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అక్కడ షూటింగ్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నారు.

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మ‌రికొంత మంది ముఖ్య న‌టీన‌టులు యాక్ట్ చేస్తున్నారు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సినిమాతోపాటు ఖిలాడి అనే సినిమా చేశారు రవితేజ. ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. అలాగే త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..

Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wnwol4

Related Posts

0 Response to "Ravi Teja: మారెడుమిల్లిలో అడవుల్లో మాస్ మహారాజా రవితేజ.. శరవేగంగా రామారావు ఆన్ డ్యూటీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel