-->
Telangana Devudu : గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్దమైన ‘తెలంగాణ దేవుడు’.. రిలీజ్ ఎప్పుడంటే

Telangana Devudu : గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్దమైన ‘తెలంగాణ దేవుడు’.. రిలీజ్ ఎప్పుడంటే

Srikanth

Telangana Devudu : మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ మా చిత్రం ‘తెలంగాణ దేవుడు’కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము. చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా హీరో శ్రీకాంత్‌గారు అందించిన సహకారం మరువలేనిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్రతో వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. ఈ చిత్రంతో జిషాన్ ఉస్మాన్ అనే నూతన నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాము. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము..’’ అని అన్నారు. ఇక శ్రీకాంత్  వైపు హీరోగా సినిమాలు చేస్తునే మరో వైపు విలన్ గానూ మెప్పిస్తుంన్చడానికి రెడీ అవుతున్నారు. బోయపాటి -బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manisha Koirala: ప్రయాణం కష్టమైనదని నాకు తెలుసు.. అయినా కొనసాగించాలి.. మనీషా కోయిరాలా..

Lasya Manjunath: స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ‘లాస్య మంజునాథ్’ కొడుకు.. ఫ్యామిలీ ఫొటోస్..

Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EXhftw

Related Posts

0 Response to "Telangana Devudu : గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్దమైన ‘తెలంగాణ దేవుడు’.. రిలీజ్ ఎప్పుడంటే"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel