-->
Attack on Actor Chaurasia: కేబీఆర్ పార్క్ దగ్గర నటి చౌరాసియాపై దాడి.. మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన దుండగుడు

Attack on Actor Chaurasia: కేబీఆర్ పార్క్ దగ్గర నటి చౌరాసియాపై దాడి.. మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన దుండగుడు

Attack On Actor Chaurasia

Attack on Actor Chaurasia: కేబీఆర్ పార్క్ దగ్గర నటి చౌరాసియా పై దాడి జరిగింది. వాకింగ్ కి వెళ్లిన ఆమెపై ఓ ఆకతాయి ఈ దాడి చేశాడు. తర్వాత ఆమె మొబైల్ లాక్కెళ్లాడా దుండగుడు. వెంటనే తేరుకున్న చౌరాసియా డయల్ 100 కి సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చౌరాసియాకు గాయాలయ్యాయి. ఆమె డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్‌ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read Also… Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్‌.. ఏపీ, తెలంగాణలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్!

Karthikeya: రాజా విక్రమార్కుడి పెళ్లి ముహూర్తం అప్పుడే.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న శుభలేఖ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ced6Fi

Related Posts

0 Response to "Attack on Actor Chaurasia: కేబీఆర్ పార్క్ దగ్గర నటి చౌరాసియాపై దాడి.. మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన దుండగుడు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel