-->
IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..

IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..

Iit Kanpur

IIT Recruitment 2021: ఉత్తర‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 95 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఇందులో భాగంగా డిప్యూటీ రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెంటెండ్, జూనియ‌ర్ టెక్నీషియ‌న్స్, జూనియర్ అసిస్టెంట్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంట‌ర్మీడియ‌ట్, బీఎస్సీ, సంబంధిత స‌బ్జెక్టుల‌లో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత‌.

* సంబంధిత ప‌నిలో అనుభవంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ త‌ప్పనిస‌రిగా ఉండాలి.

* పోస్టుల‌ను అనుస‌రించి అభ్యర్థుల వ‌య‌సు 21 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్యమైన విష‌యాలు..

* అర్హత‌లు, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష/ సెమినార్ ప్రజంటేష‌న్ / స్కిల్ టెస్ట్ / ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తుల‌ను రిక్రూట్‌మెంట్ సెక్ష‌న్‌, రూ నెం 224, రెండో అంత‌స్తు (ఫ్యాక‌ల్టీ బిల్డింగ్‌), ఐఐటీ కాన్పూర్ (యూపీ), 208016.

* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (16.11.2021) ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amala Paul: అద‌ర‌గొట్టే అందాలతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న అమలా పాల్ లేటెస్ట్ స్టిల్స్..

ఇకపై చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు..నాసా స్పెషల్ బుల్లెట్టు బండి.. వీడియో

ఇకపై చంద్రుడి మీద డుగ్గు.. డుగ్గు..నాసా స్పెషల్ బుల్లెట్టు బండి.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cc6lUM

Related Posts

0 Response to "IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel