-->
Asthma: మీకు ఆస్తమా ఉందా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..

Asthma: మీకు ఆస్తమా ఉందా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..

Asthma

చలికాలం ఆస్తమా రోగులకు చాలా ప్రమాదకరం. ఈ సీజన్‌లో ఉబ్బసం వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో రోగులు ఈ 4 విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

చలికాలంలో చలి ప్రభావం వల్ల శ్వాసకోశ నాళాలు కుంచించుకుపోతాయి. దీని కారణంగా ఆస్తమా రోగులకు సమస్య బాగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆస్తమా రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సీజన్‌లో ఆస్తమా రోగులు ఎల్లవేళలా ఇన్‌హేలర్‌ను తమ వెంట తీసుకెళ్లాలి. తద్వారా సమస్య పెరిగినప్పుడు దానిని నియంత్రించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రోగి ఇన్హేలర్ ద్వారా పీల్చే ఔషధం, అతని సంకోచించిన శ్వాసనాళాలు తిరిగి వాటి రూపానికి తీసుకొస్తాయి. అటువంటి పరిస్థితిలో అతను వెంటనే ఉపశమనం పొందుతాడు.

ఇన్హేలర్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి, దానిని సరిగ్గా ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇన్హేలర్ ఉపయోంగించడంలో 4 దశలు ఉన్నాయి. మొదటి దశలో మీ ఊపిరి వదలాలి. రెండో దశలో దీర్ఘ శ్వాస తీసుకుని ఇన్హేలర్తో ఔషధాన్ని సరిగ్గా పీల్చాలి తద్వారా ఔషధం పూర్తిగా ఊపిరితిత్తులకు చేరుతుంది. మూడో దశలో మందు పీల్చుకున్న తర్వాత పది సెకన్ల పాటు శ్వాసను ఆపుకోండి. నాల్గో దశలో ఇన్హేలర్ శుభ్రం చేయాలి

చలికాలంలో ఆస్తమా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. దీని కోసం, శరీరం వెచ్చగా ఉండటానికి వెచ్చని దుస్తులను సరిగ్గా ధరించండి, తద్వారా జలుబు సమస్య పెరగదు. కఠినమైన వ్యాయామం చేయవద్దు.

Read Also.. Winter Health: శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఇబ్బందులు.. ఇలా చేసి చూడండి.. చటుక్కున మాయం అయిపోతాయి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32AlNbt

Related Posts

0 Response to "Asthma: మీకు ఆస్తమా ఉందా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel