
Anand Rathi Wealth IPO: డిసెంబరు 2న ఆనంద్ రాఠీ వెల్త్ ఐపీఓ.. ఒక్కో షేరు ధర రూ.530-550గా నిర్ణయం

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఆనంద్ రాఠీ ఆధ్వర్యంలోని ఆనంద్ రాఠీ వెల్త్ డిసెంబరు 2న ఐపీఓకి రానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 6న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిని రూ.530-550గా నిర్ణయించారు. మొత్తం రూ.660 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పబ్లిక్ ఇష్యూలో ఉన్న మొత్తం 1.2 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) కింద విక్రయిస్తున్నవే.
వీటిలో 2.5 లక్షల షేర్లు ఉద్యోగులకు రిజర్వు చేయగా.. 15 శాతం షేర్లను సంస్థాగతేతర మదుపర్లు, 35 శాతం రిటైల్ మదుపర్లకు, మిగిలిన షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. ఈ ఐపీవోలో పాల్గొనలంటే లాట్లో కొనుగోలు చేయాలి. ఒక్క లాట్లో 27 షేర్లు ఉంటాయి. కనీసం 14,850 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఆనంద్ రాఠీ వెల్త్‌ను 2002లో స్థాపించారు. ఆంఫీ వద్ద నమోదైన ఈ సంస్థ ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ పథకాలను పంపిణీ చేస్తోంది. మార్చి 31, 2019 – ఆగస్టు 31, 2021 మధ్య కంపెనీ నిర్వహణలోని ఆస్తుల మొత్తం (ఏయూఎం) 22.74 శాతం పెరిగింది. సెప్టెంబరు 2018లోనూ సంస్థ రూ.425 కోట్ల సమీకరణ లక్ష్యంతో సెబీ వద్ద ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Read Also.. Maruti Suzuki: మారుతి సుజుకి షాకింగ్ నిర్ణయం.. ఈకో వ్యాన్ ధరలను రూ.8 వేలు పెంచుతున్నట్లు వెల్లడి
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ljkGDt
0 Response to "Anand Rathi Wealth IPO: డిసెంబరు 2న ఆనంద్ రాఠీ వెల్త్ ఐపీఓ.. ఒక్కో షేరు ధర రూ.530-550గా నిర్ణయం"
Post a Comment