-->
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ఏపీ నుంచి భారీ విరాళం.. కేజీ బంగారం విరాళంగా ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త..

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ఏపీ నుంచి భారీ విరాళం.. కేజీ బంగారం విరాళంగా ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త..

Yadadri Temple

Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ విరాళం వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జడ్పీటీసీ మోడెం జయమ్మ యాదాద్రి లక్ష్మీ నసింహ స్వామి గర్భగుడికి బంగారు తాపడం కోసం ఒక కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణాన్ని చేపట్టి, పూర్తిచేయడం ఒక గొప్ప యజ్ఞం అని కొనియాడారు. అతి త్వరలో దేవాలయాన్ని పునః ప్రారంభించబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటించారు.

పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిని బంగారు తాపడంతో చేపడుతున్నామని, ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని ఉటంకించారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు.. తాను, తన కుటుంబ సభ్యులందరం కలిసి ఒక కేజీ బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ఇవ్వనున్నట్లు జయమ్మ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్‌ను కలిసి.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందజేస్తామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి అంటే తనకు ఎంతో నమ్మకం, ఇష్టమని జయమ్మ చెప్పుకొచ్చారు. ఈ మహత్తర కార్యక్రమంలో తాను, తన కుటుంబ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

Also read:

Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..

Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

Huzurabad Elections: మరింత హీటెక్కిన హుజూరాబాద్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3G1cZe0

0 Response to "Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ఏపీ నుంచి భారీ విరాళం.. కేజీ బంగారం విరాళంగా ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel