Telangana Srimantudu: యాభై ఏళ్లైనా పుట్టి పెరిగిన ఊరుపై తరగమని మమకారం.. తానున్నానంటూ ముందుకొచ్చిన శ్రీమంతుడు..

Telangana Srimantudu: ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. తాను పుట్టిపెరిగిన ఊరిని విడిచి యాభై సంవత్సరాలైనా కానీ, ఆ ఊరి మీద ప్రేమ అతనికి ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలను ఆ ఊర్లోనే జరిపి, అందరికీ విందు భోజనం పెట్టారు. పేదలకు కొత్తబట్టలు అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామానికి చెందిన అల్లంకి సత్యనారాయణ యాభై సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సుల్తానాబాద్‌కు వచ్చాడు. సుల్తానాబాద్‌లో టాప్ టెన్ బిజినెస్ మ్యాన్‌లలో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరాడు. మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. సత్యనారాయణ కుమారుడు అరుణ్- మనీషా ల కూతురు ఆద్య మూడవ జన్మదినోత్సవాన్ని తన స్వగ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో గ్రామస్థుల సమక్షంలో జరిపారు. అరవై మంది పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేసి, అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఎల్లవ్వ తో పాటు, గ్రామ పాలకవర్గం, గ్రామ కులసంఘాల పెద్దలందరికీ సత్యనారాయణ దంపతులు సన్మానం కూడా చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇంకా సహాయం చేయడానికి ఎప్పటికీ ముందుంటానని సత్యనారాయణ తెలిపారు. గ్రామస్థులు సత్యనారాయణ దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు.
Also read:
Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nbq9ww


0 Response to "Telangana Srimantudu: యాభై ఏళ్లైనా పుట్టి పెరిగిన ఊరుపై తరగమని మమకారం.. తానున్నానంటూ ముందుకొచ్చిన శ్రీమంతుడు.."
Post a Comment