-->
Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..

Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్..

Telangana MLA: దయ్యమా? అదేక్కడుంది? చూపెట్టండి ఎలా ఉంటుందో? ఓ అవ్వ, బడి కాడికీ రా, దయ్యం వచ్చిందటా చూద్దాం! మీ ఊరి బొడ్రాయి వద్ద, ఒంటరిగా పడుకుంటా, దయ్యాన్ని రమ్మను, దాని సంగతి చూస్తా! అంటూ ఓ ఎమ్మెల్యే హల్ చల్ చేశాడు. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యే భూత వైద్యుని పాత్రకు న్యాయం చేస్తూ, అడగకున్నా వరాలిచ్చే శంకరుడి అవతారం ఎత్తారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే… ఎంటా కథ.. ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు గ్రామం పాటిమీదిగూడెంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు. దయ్యం పట్టిందని పాటిమీదిగూడెంలోనీ ప్రజలు ఇళ్ళకు తాళాలు వేసి, ఒక్క పూట వదిలేయడం గురించి TV9 లో ప్రసారం అయ్యింది. ఇది చూసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెంటనే స్పందించారు. పాటిమీదిగూడెంలో ప్రతి ఇంటికీ వెళ్ళారు. గూడెం మొత్తం కలయతిరిగారు. ఇల్లిల్లూ తిరుగూతూ దయ్యాన్ని ఎక్కడుంది, చూపించండి అంటూ గ్రామస్తులను అడిగారు. ‘‘దయ్యం ఎక్కడో లేదు, మీరు తాగే గుడుంబానే పెద్ద దయ్యం, ఈ గుడుంబా దయ్యం వదిలితే, అన్ని దయ్యాలు పోతాయి.’’ అని ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే.

మీకు దయ్యం గురించి అంత భయం ఉంటే, మీరు అందరు ఊరు ఖాళీ చేసి వెళ్ళండి.. నేను ఒక్కడినే బొడ్రాయి వద్ద పడుకుంటా, దయ్యాన్ని రమ్మనండి, దాని సంగతి చూస్తా అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంతేకాదు.. పాటిమీదిగూడెంలో యాభై డబుల్ బెడ్రూం ఇళ్ళు తక్షణమే మంజూరు చేశారు. ఓ నూతన పాఠశాలను, ఇద్దరు ఉపాధ్యాయులను, అంతర్గత రోడ్ల అభివృద్ది, గ్రామానికి లింక్ రోడ్డును మంజూరు చేయిస్తానని శంకర్ నాయక్ హామి ఇచ్చారు.

అయితే, ఇవన్నీ చేయాలంటే చిన్న కండీషన్ పెట్టారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. అది కూడా ప్రజల బాగు కోరే షరతులే. గుడుంబా జోలికి వెళ్ళనని బొడ్రాయి మీద ప్రమాణం చేస్తేనే అభివృద్ది జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో గుడుంబా తాగము, తయారుచేయము అని బొడ్రాయి మీద ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు. పన్నెండు మంది సభ్యులతో అభివృద్ది కమిటీ వేశారు. వారితో కూడ ప్రమాణం చేయించారు. ఇలా పాటిమీదిగూడెంలో గుడుంబా అనే దయ్యాన్ని పారద్రోలేందుకు భూతవైద్యుడిగా అవతారం ఎత్తారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇక తాను ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తానని ఎమ్మెల్యే కూడ ప్రమాణం చేసారు. ఈ నెల 25 వ తేదీన డబుల్ బెడ్రూం ఇళ్ళు, పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించేందుకు మూహుర్తం ఖరారు చేశారు. అదే తరహాలో పోడు భూములకు హక్కు పత్రాలిప్పిస్తానని హామి ఇచ్చారు.

మారు మూల గ్రామంలో సుమారు నాలుగు గంటల పాటు ఉండి.. ప్రతి ఇంటికీ వెళ్ళి, యోగ క్షేమాలు తెలుసుకుని ధైర్యం చెప్పి, అభివృద్దికి హామి ఇచ్చి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని బొడ్రాయి మీద ప్రమాణం చేసే నాయకులు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఎంతైనా ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్టైలే వేరు అని జనాలు చర్చించుకుంటున్నారు.

Also read:

Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

Huzurabad Elections: మరింత హీటెక్కిన హుజూరాబాద్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Andhra Pradesh: టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. కన్నెర్ర చేసిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pkC39Y

0 Response to "Telangana MLA: ఓ అవ్వ దయ్యం వచ్చిందటగా.. రమ్మను దాని సంగతి చూస్తా.. పల్లెటూర్లో ఎమ్మెల్యే హల్ చల్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel