-->
Space Station: అంతరిక్షంలో ఆరు నెలల పాటు.. సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు వెళ్ళిన చైనా వ్యోమగాములు!

Space Station: అంతరిక్షంలో ఆరు నెలల పాటు.. సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు వెళ్ళిన చైనా వ్యోమగాములు!

China Space Staion

Space Station: అంతరిక్ష పరిశోధనల్లో చైనా కొత్త అధ్యాయానికి తెరతీసింది. కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రంలో శనివారం ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. మంగూలియాలోని గోబీ ఎడారిలోని జికుయాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చి 2 ఎఫ్ రాకెట్ నుంచి షెంజౌ -13 అంతరిక్ష నౌకను ప్రయోగించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల తరువాత రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆ తరువాత 6:30 గంటల ప్రయాణించిన అంతరిక్ష నౌక యాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. వ్యోమగాములు 183 రోజులు (సుమారు 6 నెలలు) ఇక్కడ ఉండి పని చేస్తారు. ఇది ఇప్పటివరకు చైనాజు సంబంధించి సుదీర్ఘ స్పేస్ మిషన్. టియాంగాంగ్ అంటే చైనీస్ భాషలో స్వర్గం అని అర్ధం.
ఒక మహిళా వ్యోమగామి కూడా..
హై షాయ్ గైజిగాంగ్, వాంగ్ యాపింగ్, యి గ్వాన్‌ఫు కూడా ఉన్నారు. వీరు స్టేషన్ సాంకేతికతను పరీక్షిస్తారు. అంతరిక్ష నడకలు చేస్తారు. జై మిషన్ కమాండర్‌గా ఉంటారు. అతను 2008 లో చైనా మొదటి స్పేస్ వాక్ చేశాడు. అతనికి చైనా ప్రభుత్వం స్పేస్ హీరో అనే బిరుదును ఇచ్చింది.

యి గ్వాన్‌ఫు కోసం ఇది మొదటి అంతరిక్ష యాత్ర. అతను ప్రస్తుతం మిలిటరీ, వ్యోమగామి బ్రిగేడ్‌లో రెండవ స్థాయి వ్యోమగామి. వాంగ్ యాపింగ్ అనే మహిళా వ్యోమగామి కూడా ఇక్కడ ఉన్నారు. 2013 లో ఒక మిషన్‌లో పాల్గొన్న ఆమెకు అవార్డు లభించింది. అంతరిక్షంలోకి వెళ్లిన చైనా తొలి మహిళా వ్యోమగామి ఆమె. స్పేస్ వాక్ చేసిన తొలి చైనా మహిళ కూడా ఆమె.

Also Read: Festival Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Energy Crisis: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఎనర్జీ సంక్షోభం.. కారణాలు తెలుసుకోండి!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vm50Df

Related Posts

0 Response to "Space Station: అంతరిక్షంలో ఆరు నెలల పాటు.. సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు వెళ్ళిన చైనా వ్యోమగాములు!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel