
TS Inter Exams: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

Telangana Inter 1st Year Exams: తెలంగాణాలో కరోనా వలన వాయిదా పడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈరోజు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు జరగనున్న ఈ పరీక్షలు నవంబర్ 2వ తేదీ (మంగళవారం) తో ముగుస్తాయి. స్టూడెంట్స్ పరీక్షాకేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని.. పరీక్షకు ఒక్క సెకను ఆలస్యం అయినా అనుమతించమని.. అధికారులు స్పష్టం చేశారు. పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక 4,59,228 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఈ సారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నిర్వహణలో కొత్తగా మొబైల్ యాప్ ను వినియోగంలోకి తీసుకుని రానున్నారు. ఓఎంఆర్ షీట్‌లో మాల్‌ప్రాక్టీస్, బ్లాంక్ బార్ కోడ్, ఆబ్సెంట్, డ్యామేజ్, బార్‌కోడ్, ఎయిడెడ్ క్యాండిడేట్స్ వంటి సేవలను ఈ యాప్ అందించనుంది. ఇక బెంచీకి ఒకరు చొప్పున మాత్రమే కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఈసారి హాల్‌టికెట్లను విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం, కళాశాల స్టాంపులు అవసరం లేదు. విద్యార్థి ఫొటో, వివరాలను పరిశీలించి పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు.
ఇక పరీక్ష నిర్వహించనున్న కేంద్రాల్లో అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్న ప్రైవేట్, పాఠశాల కేంద్రంలో విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం పై దృష్టి సారించారు. ఇప్పటికే పరీక్ష నిర్వహించే కాలేజీలను తగిన విధంగా శానిటేషన్ చేశారు. ఇక కరోనా వైరస్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షా కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఇక విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రం వివరాలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. పరీక్ష జరిగే పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. అంతేకాదు ఎగ్జామ్స్ సెంటర్లకు చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
Also Read: నేటి రాశి ఫలాలు.. ఈ రోజు ఈ రాశివారికి వ్యాపారంలో మంచి లాభలు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Zq781s
0 Response to "TS Inter Exams: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి"
Post a Comment