-->
Virat Kohli: వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోనున్న విరాట్‌.. రవిశాస్త్రి ఏమన్నాడంటే..

Virat Kohli: వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోనున్న విరాట్‌.. రవిశాస్త్రి ఏమన్నాడంటే..

ఇప్పటికే ఐపీఎల్‌, టీ-20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకొన్ని విరాట్‌ కోహ్లీ త్వరలోనే వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌ బై చెప్పనున్నాడా.. మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మాటలు వింటుంటే ఇది నిజమేననిపిస్తోంది. టెస్టులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు గాను కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోనున్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి. ‘రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో టీమిండియా ఐదేళ్లుగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అతను బాగా అలసిపోయినందుకే ఐపీఎల్‌, టీ- 20 ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్నాడు. వన్డే ఫార్మాట్లో కూడా ఇది జరగొచ్చు. ఎందుకంటే విరాట్‌ టెస్టులపై పూర్తి దృష్టి సారించాలనుకుంటున్నాడు. అయితే ఇది ఇప్పట్లోనే జరగకపోవచ్చు ‘ అని మాజీ కోచ్‌ చెప్పుకొచ్చాడు.

విరాట్‌ కూడా కూడా అదే చేశాడు..
2017 నుంచి కోచ్‌ రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌ శ్రీధర్‌లు భారత జట్టుకు సేవలందించారు. తాజా టీ 20 ప్రపంచకప్‌తో వీరి పదవీ కాలం ముగిసింది. దీంతో రవిశాస్త్రి మళ్లీ మైక్‌ పట్టుకుని కామెంటేటర్‌గా మారే అవకాశాలున్నాయి. కాగా విరాట్ కెప్టెన్సీపై స్పందించిన ఆయన.. ‘ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంలో కోహ్లీ మొదటి ఆటగాడేమీ కాదు. గతంలో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లుగా చెలామణీ అయిన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసి బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు విరాట్‌ కూడా అదే చేశాడు’ అని వ్యాఖ్యానించాడు.

Also Read:

T20 World Cup 2021: నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. పాక్ క్రికెట్ జట్టుకు మద్దతుగా ఆ దేశ ప్రధాని ట్వీట్..

T20 World Cup 2021: అతనికి యార్కర్ బౌలింగ్ చేసే జ్ఞానం లేదు.. కాబోయే అల్లుడే ఓటమికి కారణం..

T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై ఓటమికి మానసిక అలసటే కారణం.. అందుకే సరిగా ఆడలేదు.. రవి శాస్త్రి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Hg0CLH

0 Response to "Virat Kohli: వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోనున్న విరాట్‌.. రవిశాస్త్రి ఏమన్నాడంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel