-->
కీచకోపాధ్యాయుడు.. స్పెషల్‌ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం

కీచకోపాధ్యాయుడు.. స్పెషల్‌ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం

Coimbatore

Teacher Harassment: ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలకు పిలిచిన కిచకోపాధ్యాయుడు.. విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఆమెను వేధిస్తుండటంతో.. విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తనను వేధించిన కీచకుడితోపాటు మరో ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆమె లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని కోయింబత్తుర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం పోలీసులు కీచక ఉపాధ్యాయుడని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 ఏళ్ల విద్యార్థిని కోయింబత్తుర్‌ ఆర్‌ఎస్‌ పురంలోని ఉన్న ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో ఫిజిక్స్‌ బోధించే మిథున్‌ చక్రవర్తి అనే ఉపాధ్యాయుడు.. ఏప్రిల్‌లో స్పెషల్‌ క్లాసుల పేరుతో పాఠశాలకు పిలిపించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను తరచూ వేధించేవాడు. దీంతో ఆమె పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని వేరే స్కూల్‌కు బదిలీ చేశారు. సెప్టెంబర్‌లో చక్రవర్తి ఉద్యోగాన్ని మానేశాడు. ఆ తర్వాత బాలిక హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో అడ్మిషన్‌ పొంది..12వ తరగతి చదువుతోంది. అయినప్పటికీ ఆమెను వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి చూడగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా.. తన ఆత్మహత్యకి ఉపాధ్యాయుడితో సహా ముగ్గురు కారణమని.. వారందరిపై చర్యలు తసుకోవాలని బాలిక లేఖరాసి చనిపోయింది. మిథున్ చక్రవర్తి అనే ఉపాథ్యాయుడు తనను లైంగికంగా వేధించాడని.. అతన్ని వదిలిపెట్టొద్దంటూ లేఖలో పేర్కొంది. ఆమె కుటుంబసభ్యులు, సూసైడ్ నోట్ ఆధారంగా కోయంబత్తూరు నగర పోలీసులు నిందితుడైన ఉపాధ్యాయుడు మిథున్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, సెక్షన్ 9 (I) రీడ్ విత్ 10, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ ఘటన అనంతరం పాఠశాల సహా.. పలుచోట్ల ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మిథున్ చక్రవర్తిని ఉరి తీయాలని స్టూడెంట్స్, సామజిక సంఘాల నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Also Read:

Crime News: పిల్లల కోసం దారుణం.. 16 నెలల పాటు మహిళపై అత్యాచారం.. నిందితుడికి సహకరించిన భార్య..

Crime News: సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు.. అరెస్టైన మూడేళ్ల తర్వాత శిక్ష ఖరారు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31Z2JDF

0 Response to "కీచకోపాధ్యాయుడు.. స్పెషల్‌ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel