-->
TRS Plenary: నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. భారీగా తరలిరానున్న నేతలు..!

TRS Plenary: నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. భారీగా తరలిరానున్న నేతలు..!

Trs

TRS Plenary: హైదరాబాద్‌ గులాబీమయం కానుంది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10గంటల వరకు ఆహ్వానితులందరూ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. ఉదయం 10 నుంచి 10.30 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్లీనరీ ప్రారంభం అవుతుంది.

ఈ టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం 6 వేల మంది వరకు తరలిరానున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈ సారి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.

ట్రాఫిక్‌ ఆంక్షలు..

ప్లీనరీ ప్రధాన వేదిక హైటెక్స్(మాదాపూర్) చుట్టుపక్కల భారీ ఆంక్షలు ఉంటాయని, ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని పోలీసులు కోరుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన రూట్ల వివరాలను, ఇతర సూచనలను వెల్లడించారు. ప్రధానంగా నీరూస్‌ జంక్షన్‌, సైబర్‌ టవర్‌ క్రాస్‌రోడ్స్‌, మెటల్‌ చార్మినార్‌, గూగుల్‌ జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్‌, ఖానామెట్‌ జంక్షన్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి బొటానికల్‌గార్డెన్‌ జంక్షన్‌ల వద్ద మళ్లింపులుంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే నీరూస్‌ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌, దుర్గంచెరువు, ఇనార్బిట్‌, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ వైపు మళ్లిస్తారు.

ఇక మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌కు వెళ్లే వాహనదారులను రోలింగ్‌ హిల్స్‌, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్‌, దుర్గం చెరువు మీదుగా పంపుతారు. ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ. ఐఐఐటీ, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

YCP Vs TDP: ఏపీ లొల్లి ఢిల్లీకి.. ఇక అంతా హస్తినమే సవాల్.. ఒక్కసారిగా హైవోల్జేజ్‌

AP Elections: ఏపీలో మరోపోరు.. జనవరిలోగా ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఎన్నికలు!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CgdOxh

Related Posts

0 Response to "TRS Plenary: నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. భారీగా తరలిరానున్న నేతలు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel