-->
T 20 World Cup: వార్మప్ మ్యాచ్‎లో అదరగొట్టిన టీం ఇండియా.. ఇంగ్లాండ్‎పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం..

T 20 World Cup: వార్మప్ మ్యాచ్‎లో అదరగొట్టిన టీం ఇండియా.. ఇంగ్లాండ్‎పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం..

India

టీం ఇండియా ఇంగ్లాండ్‎తో జరిగిన వార్మప్ మ్యాచ్‎లో అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్, కెఎల్ రాణించండంతో భారత్ 189 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన ఇంగ్లాడ్‎ను భారత్ బౌలర్ మహ్మద్‌ షమీ ఆరంభంలోనే దెబ్బతిశాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో జోస్‌ బట్లర్‌13 బంతుల్లో 18 పరుగులు(3ఫోర్లు)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 6వ ఓవర్లో మరో వికెట్‌ను పడగొట్టాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌13 బంతుల్లో 17(2 ఫోర్లు) పెవిలియన్‌ పంపాడు. 9.2వ ఓవర్లో స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మలాన్‌ 18 బంతుల్లో 18 పరుగులు (3 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఇన్నింగ్స్‌ 14.5వ ఓవర్లో లివింగ్‌స్టోన్‌ 20 బంతుల్లో 30 (4 ఫోర్లు, ఒక సిక్స్)ను పేసర్‌ మహ్మద్‌ షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయి‎ర్‎స్టో 36 బంతుల్లో 49(4 ఫోర్లు, ఒక సిక్స్)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. చివరి ఓవర్లో చెలరేగి బ్యాటింగ్‌ చేసిన మొయిన్‌ అలీ 20 బంతుల్లో 43 పరుగులు9 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. దీంతో ఇంగ్లాడ్ 188 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు, రాహుల్ చాహర్, బుమ్రా ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‎కు దిగిన భారత ఓపెనర్లు కిషన్, రాహుల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌర్లను ఎదుర్కొన్నారు. మొదట్లో కిషన్ నెమ్మదిగా అడగా.. రాహుల్ మాత్రం విరుచుకుపడ్డాడు. 24 బంతుల్లో 51 పరుగులు చేసిన రాహుల్ 9వ ఓవర్లో వెనుదిరిగాడు.

తర్వాత బ్యాటింగ్‎కు దిగిన విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వస్తూనే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. కిషన్. 46 బంతుల్లో 70 పరుగులు చేసిన అనంతరం ఇతడు రిటైర్డ్ హర్ట్‎​గా వెనుదిరిగాడు . తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. చివర్లో పాండ్యా (12) మెరవడంతో భారత్ 19 ఓవర్లలో 192 చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డెవిడ్ విల్లీ, మార్క హుడ్, లివింగ్‌స్టోన్‌ ఒక్కో వికెట్ తీశారు. టీం ఇండియా తదుపరి వార్మప్ మ్యాచ్‎ను ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Read Also.. 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్.. టీ 20 వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డ్‌.. ఎవరో తెలుసా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DUvjDS

0 Response to "T 20 World Cup: వార్మప్ మ్యాచ్‎లో అదరగొట్టిన టీం ఇండియా.. ఇంగ్లాండ్‎పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel