-->
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..

Cbse Exams

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తోన్న తప్పుడు వార్తలకు చెక్‌ పెడుతూ బోర్డ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సీబీఎస్‌ఈ 10, 12 టర్మ్‌-1 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం బోర్డ్‌ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు నవంబర్‌ 30 ప్రారంభమవుతుండగా, డిసెంబర్‌ 11న ముగియనున్నాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు డిసెంబర్‌ 1న మొదలై 22న ముగియనున్నాయి. ఇదిలా ఉంటే సాధారణంగా పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి కానీ చలికాలం దృష్ట్యా పరీక్షలను గంట ఆలస్యం అంటే.. 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే కరోనా దృష్ట్యా ఈసారి బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ పరీక్షలను రెండు భాగాలుగా విభజించారు. టర్మ్‌1లో ప్రశ్నాపత్రం అబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. అయితే ఈ పరీక్ష పూర్తికాగానే కేవలం మార్కులను మాత్రమే ప్రకటిస్తారు. రెండు టర్మ్‌లు పూర్తి అయిన తర్వాతే పాస్‌, ఫెయిల్‌కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారు. ఇక ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌కు 50 శాతం మార్కులను కేటాయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు వీలైనంత వరకు వారి సొంత పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ ఎస్‌ భరద్వాజ్‌ తెలిపారు.

Also Read: Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!

Andhra Pradesh: గుంటూరులో అర్దరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి ఇంటికి భారీగా వచ్చిన పోలీసులు.. ఆపై..

Viral Video: కత్తులతో భజరంగ్ దళ్ సభ్యుల డ్యాన్సులు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. వీడియో వైరల్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AO9W56

Related Posts

0 Response to "CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel