-->
Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..

Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..

Cheating

Telangana Crime: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా గుర్తుందా?. ఆ సినిమాలో నటుడు బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి ఏవీఎస్‌ను దారుణంగా నిలువు దోపిడీ చేస్తారు. బంగారు నగలు రెట్టింపు చేస్తామని నమ్మబలికి.. ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఒక మూటలో కట్టిపెడతారు. ఆ తరువాత నీటిలో ముంచి బయటికి తీస్తారు. ఈ గ్యాప్‌లోనే అసలు నగలు మూటను మాయం చేసి.. ఇనుప ముక్కలు పెట్టిన మూటను అక్కడ పెడతారు. ఆ తరువాత నీటి నుంచి నిధుల మూట ఓపెన్ చేయగా.. అందులో అన్నీ ఇనుప ముక్కలే ఉంటాయి. అలా ఏవీఎస్‌ కుటుంబాన్ని ముగ్గురూ కలిసి దారుణంగా దోచేస్తారు. సరిగ్గా అలాంటి ఘరానా మోసమే తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. డబ్బులు రెట్టింపు చేస్తాం అంటూ బురిడి కొట్టించిన నకిలీ బాబా యవ్వారం బట్ట బయలైంది. ఆదిలాబాద్ జిల్లాలోని మహమ్మద్ ఫారుఖ్ అనే బాదితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సుగ్రీవ్ ( బాబా ), సంగీత అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 11 లక్షల 70 వేల నగదు, మూడు తులాల బంగారం ను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.

వివరాల్లోకెళితే.. కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే గోటిముక్కల సుగ్రీవ్ అలియాస్ సూర్యవంశి సుగ్రీవ్ అలియాస్ సుగ్రీవ్ బాబా అవతారం ఎత్తాడు. బాల్ శంకర్ సంగీత అనే కూరగాయలు విక్రయించే మరో మహిళతో కలిసి జిత్తులమారి వేశాలకు తెర లేపాడు. ఉట్నూర్, ఇంద్రవెళ్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కొందరు వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని పూజలు చేస్తూ డబ్బులు డబుల్ చేస్తామంటూ నమ్మించారు. లక్షకు లక్షన్నర.. రెండు లక్షలకు నాలుగు లక్షలు ఇలా పూజల పేరిట డబుల్ డబ్బులు ఇస్తూ అమాయకులను బురిడి కొట్టించాడు ఆ బురిడి బాబా సుగ్రీవ్. భారీ మొత్తంలో చేతిలో పడగానే పలాయనం చిత్తగించాడు. బురిడి బాబా సుగ్రీవ్ మాయలు తెలియక డబ్బులకు ఆశపడి మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆదిలాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ బాబాను అరెస్ట్ చేశారు. పూజల పేరిట డబ్బులు డబుల్ అవుతాయని నమ్మితే నిండా మునగడం ఖాయమని‌, నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు చెప్పారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజ.

Also read:

సరదాకి సముద్రంలో వల వేశాడు.. బరువుగా అనిపించి లాగాడు.. ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు..

Bangladesh: హిందువులపై దాడులు జరుగుతుంటే.. బంగ్లా ప్రధాని ఫ్లూట్ వాయిస్తున్నారు..రచయిత్రి తస్లీమా నస్రీమ్ ఘాటు వ్యాఖ్యలు

Clapping: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని లాభాలా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3piruEg

0 Response to "Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel