
Cow protection: గోవులను సంరక్షించి తనకున్న భక్తి.. ప్రేమను చాటుతున్న చాంద్ భాషా, పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Cows Protection: కర్నూలు జిల్లాలో ముస్లిం వ్యక్తి 450 కి పైగా గోవులను సంరక్షించి గోవులపై తనకున్న అపార భక్తినీ, ప్రేమను చాటుకుంటున్నారు. ఎన్ని గోవులు ఉన్నప్పటికీ పాలని దూడలకు వదిలేస్తాడు. దూడకు వదిలేసిన పాలని పిండుకుని నెయ్యి తద్వారా ఆయుర్వేద మందులకు ఉపయోగిస్తున్నాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన చాంద్ భాషకు గోవులు అంటే మహా ఇష్టం. గోమూత్రము, గోవు పేడతో ఉత్పత్తులను తయారు చేసి ఇ మార్కెటింగ్ చేస్తున్నాడు.
తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో సేకరించిన గోవు పేడను హోమానికి అవసరమయ్యే పిడకలుగా తయారు చేస్తాడు. గత ఐదు సంవత్సరాలుగా చాంద్ బాషా ఇదే వృత్తిని ఎంచుకున్నారు. స్వదేశీ గోవు ఉత్పత్తులు పేరట మార్కెటింగ్‌ను చేస్తున్నాడు. ఆన్లైన్లో సైతం ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి నెల రెండు లక్షలకు పైగా ఆవు పిడకలను తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, బళ్లారి ముంబై, తదితర మెట్రో నగరాలకు పంపుతున్నాడు.
ఆరోగ్యంగా ఉన్న ఆవు మూత్రాన్ని నేరుగా సేకరించి 60 నుంచి 70 డిగ్రీల వరకు మరిగించి ఆవిరి ద్వారా నీటిని సేకరిస్తారు. మరిగించే సమయంలో తిప్పతీగ తులసి ఆకులను కలుపుతారు. ప్రకృతి సేద్యానికి అవసరమయ్యే వాటిని తయారుచేస్తారు. గో సంరక్షణకు చాంద్ భాషా చేస్తున్న ప్రయత్నాలను జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రముఖంగా ప్రస్తుతించారు.
నాగిరెడ్డి, టీవీ9 రిపోర్టర్, కర్నూల్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vn2cG0
0 Response to "Cow protection: గోవులను సంరక్షించి తనకున్న భక్తి.. ప్రేమను చాటుతున్న చాంద్ భాషా, పవన్ కళ్యాణ్ ప్రశంసలు"
Post a Comment